TRENDING #దేవాలయాలు #పండుగలు #జీవనవిధానం #రామాయణం #మహాభారతం
📅

శివుడికి విభూది ఎందుకు ఇష్టం?

పబ్లిష్ తేదీ: Sunday, May 31, 2026


                       విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అందులోనూ కాస్త విభూతిని అలంకరించినా భోళాశంకరుడు సంతోషిస్తాడని అంటారు. మన సనాతన హిందూ సంప్రదాయంలో విభూది (భస్మం)కి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా పరమశివుడు తన శరీరమంతా విభూదిని ధరించిన రూపంలో దర్శనమిస్తాడు. దీనికి లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది.

Read Full Article in English:


Shivudiki_vibhuthi_endhuku_istam
    హర హర మహాదేవ్🔱

🔱 విభూది జీవిత సత్యాన్ని గుర్తు చేస్తుంది. శివుడు భౌతికపరమైన ఆభరణాలకు బదులుగా శరీరం అంతటా విభూతిని ధరించటంలో మనిషి ఎంత ధనవంతుడైనా, శక్తివంతుడైనా చివరికి ఈ శరీరం భస్మంగా మారిపోతుంది అనే తాత్విక పరమార్థం దాగి ఉంది. ఈ సత్యాన్ని ఎప్పటికీ మరువకూడదనే సందేశాన్ని విభూతి ఇస్తుంది.


🔱 అహంకారాన్ని దూరం చేస్తుంది విభూదిని ధరించడం ద్వారా అహంకారం, గర్వం వంటి భావాలు నశిస్తాయని, సకల బంధాలకు అతీతుడైన వైరాగ్య స్వరూపాన్ని తెలియజేయడమే శివ తత్వం అని భక్తులు విశ్వసిస్తారు. శివుడు వైరాగ్యానికి ప్రతీక కావడంతో విభూదిని ఎంతో ఇష్టపడతాడు.


🔱  పవిత్రత:  పవిత్రతకు చిహ్నం అయిన యజ్ఞాలలో సమర్పించిన పవిత్ర పదార్థాలు అని కాలిపోయి స్వచ్ఛమైన బూడిదగా మారిన తర్వాత ఏర్పడే విభూది పవిత్రమైనదిగా భావించబడుతుంది. అందుకే భక్తులు నుదుటిపై విభూదిని ధరిస్తారు.
🔱 ఆధ్యాత్మిక శక్తికి సంకేతం అయిన శివసారంలో శైవ సంప్రదాయం ప్రకారం విభూది ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి, దైవ చింతన పెరుగుతుందని నమ్మకం.


🔱 శివుడు మృత్యువుకి ప్రతీక. విభూతి మనిషి జీవితంలో అంతిమ సత్యం. ఏదో ఒకరోజు సమస్త ప్రాణుల భౌతిక శరీరం, ప్రాపంచిక ఆస్తిపాస్తులు బుడిదైపోతాయనే సత్యాన్ని ఇది సూచిస్తుంది. దిగంబరుడైన పరమేశ్వరుడు స్మశానవాసి. రుద్ర భూమిలో అందరూ సమానమే. స్వామి రంగూ రూపు లేని విభూతి ధారణ ద్వారా ఆ సమానత్వాన్ని బోధిస్తాడు.


✨ ముగింపు: 

       శివుడికి విభూది అంటే ఇష్టం అనడానికి కారణం అది కేవలం భస్మం కాదు; జీవిత నశ్వరత్వం, వైరాగ్యం, పవిత్రత మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. అందుకే పరమశివుడు విభూదిని తన అలంకారంగా ధరించి భక్తులకు గొప్ప సందేశాన్ని అందిస్తున్నాడు.
      ఇంతటి విశిష్టత కలిగిన విభూతిని సాధారణంగా నుదుటిపైనా, ఛాతి దగ్గర, గొంతు భాగంలోనూ పెట్టుకోవడం ద్వారా  శరీరంలోని చక్రాలు ఉత్తేజితం అవుతాయని నమ్మకం.

                  ఓం నమః శివాయ 


        📖 ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం Sanatana Saga ను సందర్శించండి! 🙏🕉️


🪔

మీ పవిత్ర అభిప్రాయాన్ని పంచుకోండి

ఈ ఆధ్యాత్మిక కథనం లేదా శ్లోకంపై మీ అమూల్యమైన స్పందనను తెలియజేయండి. మీ అభిప్రాయం మాకు ఎంతో విలువైనది.