TRENDING #దేవాలయాలు #పండుగలు #జీవనవిధానం #రామాయణం #మహాభారతం
📅

"గంగా దసరా కథ" – భూమికి గంగాదేవి ఎలా వచ్చిందో తెలుసా?

పబ్లిష్ తేదీ: Friday, May 22, 2026

భగీరథుడి తపస్సుతో భూమిపైకి దిగివచ్చిన పవిత్ర గంగాదేవి పూర్తి కథ:

హిందూ సాంప్రదాయంలో గంగానది కేవలం ఒక నది కాదు…భారతీయ సంస్కృతికి జీవనాడి, పవిత్రతకు ప్రతీక. పాపాలను తొలగించే దైవశక్తిగా గంగాదేవిని భావిస్తారు.ఆమెను భక్తితో స్మరించడం కూడా పుణ్యమే. ప్రతి సంవత్సరం జరుపుకునే గంగా దసరా పండుగ వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఈ కథలో భక్తి, పట్టుదల, తీవ్రమైన తపస్సు, ఆ మహాశివుడి మహిమ కనిపిస్తాయి.


1. సాగర చక్రవర్తి మరియు 60 వేల మంది కుమారులు :

         పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన సాగరుడు అనే మహారాజు ఉండేవాడు.ఆయన తన రాజ్య విస్తరణ కోసం, అశ్వమేధ యాగం తలపెట్టాడు.ఆ యాగానికి సంబంధించిన పవిత్రమైన గుర్రాన్ని దేవేంద్రుడు దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టివేశాడు.

• సాగరుని 60 వేల మంది కుమారులు ఆ గుర్రాన్ని వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు.అజ్ఞానంతో, గర్వంతో వారు కపిల మహర్షిని అవమానించడం జరిగింది.దాంతో కోపగించిన కపిల మహర్షి తన తపో శక్తితో వారందరినీ బూడిదగా మార్చేశాడు.


2. భగీరథుడి మహా తపస్సు, గంగను భూమిపైకి రప్పించే ప్రయత్నం:

          చాలా సంవత్సరాల తర్వాత సాగర వంశంలో భగీరథుడు జన్మించాడు. తన పూర్వీకులకు మోక్షం కలిగించాలని మహా పవిత్రుడైన భగీరథుడు మహా సంకల్పం పూనుకున్నాడు. స్వర్గలోకంలో ఉన్న దివ్య నది అయిన గంగాదేవిని భూమిపైకి తీసుకొస్తేనే తన పూర్వీకుల బూడిద పవిత్రమై వారికి మోక్షం లభిస్తుందని గ్రహించాడు.అందుకోసం గంగాదేవిని భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. భగీరథుడు ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు.

 అతని భక్తికి మెచ్చి, సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు.


3. గంగాదేవి భూమిపైకి అవతరణ - ఎదురైన అడ్డంకులు:

   భగీరథుని ప్రార్థనను మన్నించిన బ్రహ్మదేవుడు, గంగాదేవిని భూమిపైకి వెళ్లాల్సిందిగా కోరాడు.  భగీరథుడి ప్రార్థనతో గంగాదేవి భూమిపైకి రావడానికి అంగీకరించింది. కానీ ఒక సమస్య ఉందని చెప్పింది.

“నేను స్వర్గం నుంచి నేరుగా భూమిపై పడితే… నా ప్రవాహా వేగాన్ని భూమాత తట్టుకోలేదు.నా ఉగ్ర ప్రభావాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంది?”  అని ప్రశ్నించింది. 

అప్పుడు  బ్రహ్మదేవుడు ఒక పరిష్కారం చెప్పాడు.


4. 🔱 శివుడి జటాలో ఆగిన గంగాదేవి 🌊

        భగీరథుడు పరమశివుని కోసం మరోసారి కఠోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నమై గంగను తన దివ్యమైన జటాజుటాల్లో ఆపడానికి ఒప్పుకున్నాడు. గంగాదేవి ఉగ్రంగా భూమిపైకి దిగివచ్చింది. కానీ శివుడు తన జటాల్లో ఆమె ప్రవాహాన్ని బంధించాడు.శివుడు ఆమె ప్రవాహాన్ని ఒక చిన్న ధారగా మెల్లగా హిమాలయాల మీదుగా భూమిపైకి విడుదల చేశాడు. 

 అందుకే శివుడిని “గంగాధరుడు” అని పిలుస్తారు. 


“Ganga Dussehra Story in Telugu”
             గంగను జటాల్లో దాచిన శివుడు

5. భగీరథుడి పూర్వీకులకు మోక్షం :

       గంగాదేవి భగీరథుడిని అనుసరిస్తూ సాగింది. చివరకు సాగరుని కుమారులు బూడిదగా మారిన పాతాళ ప్రదేశానికి (కపిల మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతం) చేరుకుంది.గంగాజలం తాకడంతో వారికి మోక్షం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. భగీరథుడి అంతులేని పట్టుదల వలనే గంగ భూమికి వచ్చిందని, అందుకే ఈ నదికి "భాగీరథి" అనే పేరు కూడా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

        అప్పటి నుంచి గంగానది పవిత్ర నదిగా భావించబడుతోంది.                                            

“Ganga Dussehra Story in Telugu”

               భగీరథ గంగా నదుల కలయిక


ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ గంగ దసరా ఉత్సవాలను భారతదేశంలో 2026 సంవత్సరంలో మే 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు జరుపుకోనున్నారు. ఈ ఉత్సవాల సమయంలో గంగాస్నానం చెయ్యడం వలన చేసిన పాపాలు తొలగిపోతాయని, పుణ్యఫలం కలుగుతుందని నమ్మకం.


🪔 గంగా దసరా రోజు చేయాల్సినవి 🪔


•ఉదయం స్నానం: సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం లేదా ఇంట్లోనే గంగాజలం కలిపి స్నానం చేయడం.


•శివారాధన: శివాలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం.


•మహామంత్ర జపం: రోజంతా “ఓం నమః శివాయ” మంత్రాలను జపించడం.


•దానధర్మాలు: పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయడం అత్యంత శ్రేయస్కరం.


•గంగాదేవి ప్రార్థన: గంగాష్టకం పఠిస్తూ అమ్మను మనసారా ప్రార్థించడం.


ముగింపు :

గంగాదేవి కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది.

భక్తితో చేసిన ప్రార్థన…నిజమైన తపస్సు…అంకితభావం మరియు పట్టుదల

దైవానుగ్రహాన్ని తప్పకుండా తీసుకొస్తాయి.గంగ కేవలం ఒక నది కాదు… భారతీయ సంస్కృతికి జీవనాడి.  ఆమెను భక్తితో స్మరించడం కూడా పుణ్యమే. భగీరథుడి కృషితో భువికి దిగివచ్చిన గంగామాతను భక్తితో స్మరిస్తూ, మన సంస్కృతిని కాపాడుకుందాం.


“ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మళ్లీ తప్పకుండా సందర్శించండి.”🙏


📖 Also Read below Articles:  

🔗 Ganga Dussehra Story & Significance

🔗 తులసి మొక్కను ఎందుకు పవిత్రంగా పూజిస్తారు?





🪔

మీ పవిత్ర అభిప్రాయాన్ని పంచుకోండి

ఈ ఆధ్యాత్మిక కథనం లేదా శ్లోకంపై మీ అమూల్యమైన స్పందనను తెలియజేయండి. మీ అభిప్రాయం మాకు ఎంతో విలువైనది.