"అందంగా కనిపించే ప్రతి ఒక్కరు... నిజంగా సంతోషంగానే ఉంటారా?"
ప్రపంచంలో అత్యంత అందమైన ముఖం ఉన్నవారు కూడా... నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
అపారమైన సంపద ఉన్నవారు కూడా... మనశ్శాంతి కోసం వెతుకుతున్నారు.
మరి నిజమైన అందం ఎక్కడ ఉంది?
అది ముఖంలోనా? శరీరంలోనా? డబ్బులోనా? లేక ఇంకెక్కడైనా ఉందా? మన భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే దీనికి ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు."బాహ్య సౌందర్యం క్షణికం... అంతరంగ సౌందర్యం శాశ్వతం". ఈరోజు ఆ గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం.
1. నేటి సమాజంలో అందం అంటే అర్థం మారిపోయిందా?
ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిస్తే చాలు...
ఫిల్టర్లు, మేకప్,లగ్జరీ జీవితం, అందమైన ఫోటోలు... ఇవే కనిపిస్తాయి.
దీంతో చాలామంది...
"నేను అందంగా లేను..." "నా జీవితం బాగోలేదు..." అని బాధపడుతున్నారు.
కానీ... ఒక చిన్న ప్రశ్న.
ప్రతిరోజూ నవ్వుతూ ఫోటో పెట్టే ప్రతి ఒక్కరూ... నిజంగానే సంతోషంగా ఉన్నారా?
లేరు..ఎందుకంటే...
ముఖంపై నవ్వు పెట్టుకోవడం సులభం...కానీ,
మనసులో ప్రశాంతతను నిలుపుకోవడం చాలా కష్టం.
అందుకే హిందూ ధర్మం... మనిషి శరీరాన్ని కాదు...మనసును అందంగా మార్చుకోమని చెబుతుంది.
2.మనకు ఆదర్శంగా నిలిచిన పురాణ ఘట్టాలు:
శ్రీరాముడు మనకు నేర్పిన నిజమైన అందం:
రామాయణంలో శ్రీరాముడు ఎంతో అందగాడు......కానీ
ప్రజలు ఆయనను ప్రేమించింది.....ఆయన ముఖాన్ని చూసి కాదు.
ఆయన చెప్పిన సత్యాన్ని చూసి...
ఆయన చూపించిన వినయాన్ని చూసి...
ఆయన పాటించిన ధర్మాన్ని చూసి...
తండ్రి మాట కోసం....రాజ్యాన్ని వదిలేశాడు.
శత్రువులను కూడా గౌరవించాడు...అందుకే,
ఈరోజుకు కూడా లక్షలాది మందికి "శ్రీరామ" నామం తలిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది.అది రూపం వల్ల కాదు...ఆయన గుణం వల్ల!
శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప సత్యం:
భగవద్గీతలో శ్రీకృష్ణుడు "మనసును జయించిన వాడే నిజమైన విజేత" అని చెప్పాడు.
మనిషి బయట ఎంత అందంగా ఉన్నా...లోపల కోపం, అసూయ, అహంకారం, ద్వేషం ఉంటే ఆ అందానికి విలువ ఉండదు.
కానీ...
ప్రేమగా నలుగురితో మాట్లాడే వ్యక్తిగా, ఇతరులను క్షమించే గుణం గల వ్యక్తిగా, అవసరానికి ఇతరులకు సాయం చేసే వ్యక్తిగా నిజాయితీగా జీవించడమే అసలైన అందం.
శబరి కథ మనకు నేర్పిన అందం:
రామాయణంలోని శబరి కథ అందరికీ తెలుసు.
శబరి రాజకుమారి కాదు...ఆమె దగ్గర సంపద కూడా లేదు.
కానీ...
ఆమె దగ్గర ఉన్నది ఒక్కటే... అదే...అపారమైన భక్తి.
ప్రేమతో సమర్పించిన పండ్లను...సాక్షాత్తు శ్రీరాముడు స్వీకరించాడు.
ఎందుకంటే...
భగవంతుడు చూసేది...మన రూపాన్ని కాదు.మన హృదయాన్ని.
మన జీవితంలో ఎలా ఆచరించాలి?
ప్రతిరోజూ ఈ ఏడు అలవాట్లు చేసేందుకు ప్రయత్నించండి.
ఉదయం లేవగానే...
1. భూమాతకు నమస్కారం చేయడం.
2. తల్లిదండ్రులతో ప్రేమగా రెండు మాటలు మాట్లాడడం.
3. ఐదు నిమిషాలు...దేవుని నామస్మరణ చేయడం.
4. నలుగురితో మంచిగా మాట్లాడడం.
5. ఎవరినీ అవమానించకుండా ఉండడం.
6. కోపం వచ్చినప్పుడు...ఒక్క రెండు నిమిషాలు సహనం పాటించడం.
7. రాత్రి పడుకునే ముందు...
"ఈ రోజు నేను చేసిన మంచి పని ఏమిటి" అని ఆత్మ పరిశీలన చేసుకోండి.
ఈ చిన్న అలవాట్లు...మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి.
ముగింపు:
కాలం గడుస్తున్నా కొద్దీ...
మన ముఖం ముసలితనం పొందుతుంది,శరీరం బలహీనమవుతుంది, సంపద కూడా శాశ్వతం కాదు... కానీ...
మనం చేసిన మంచి పనులు, మన ప్రేమ, మన దయ,
మన ధర్మం ఎప్పటికీ నిలిచిపోతాయి.
అందుకే మన ఋషులు చెప్పారు...
"శరీర సౌందర్యం కాలంతో పాటు తగ్గిపోతుంది... ఆత్మ సౌందర్యం ధర్మంతో పెరుగుతుంది."
ఈ రోజు నుంచి...
అద్దం ముందు నిలబడి...ముఖాన్ని మాత్రమే కాదు...
మనసును కూడా చూసుకోవడం మొదలుపెడదాం.
ఎందుకంటే...
నిజమైన అందం... దేవుడు ఇచ్చిన ముఖంలో కాదు...
మనం అనుసరించే ధర్మంలో ఉంటుంది.